మరో వివాదంలో గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి

by  |
మరో వివాదంలో గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి
X

దిశ, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పారిశుద్ధ్యం పనులపై ఆకస్మిక తనిఖీకి వెళ్ళిన ఆమె ఇద్దరు స్వీపర్లు గైర్హాజరు కావడం గమనించారు. దీంతో వారి స్థానంలో ఏకంగా తన డ్రైవర్ భార్యను, తన తండ్రి ఎంపీ కేశవరావు కారు నడిపే డ్రైవర్ తల్లినీ నియమించినట్లు ఉద్యోగం కోల్పోయిన స్వీపర్లు ఆరోపిస్తున్నారు. కరోనా బారిన పడి తాము ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నామని, ఈ సమాచారం తమ సూపర్ వైజర్‌కు అందించామని వాపోయారు. అనారోగ్యంతో సెలవులలో ఉన్న తమను ఉద్యోగం నుంచి తొలగించి కొత్త వారిని ఎలా నియమిస్తారని, తమ పొట్టపై కొట్టారని రమాదేవి, శారద అనే స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story