ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం..

by  |
ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇన్ని రోజులు పాటలతో, గుర్తులతో హోరెత్తించిన మైకులు మూగబోయాయి. ఎన్నికల నిబంధనల్లో భాగంగా నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో మొత్తం 150 డివిజన్లలో 1,893 మంది అభ్యర్థులు నిలిచారు. డిసెంబర్ 1న మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషనర్ పార్థసారధి స్పష్టం చేశారు. పోలింగ్ కోసం మొత్తం 9,101 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా కొండాపూర్ డివిజన్‌లో 99 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అంతేగాకుండా పోలింగ్ విధుల్లో 45 వేల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 74,04,286 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గ్రేటర్‌లో అతిపెద్ద డివిజన్‌ మైలార్‌దేవ్‌పల్లి కాగా, చిన్న డివిజన్‌ ఆర్సీ పురం. 15‌‌0 డివిజన్లలో డివిజన్​కు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, వృద్దులకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్​ ప్రక్రియలో భాగంగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఆదివారం వరకు 87 శాతం పోల్​ చిట్టీలు పంపిణీ చేశారు. మిగిలిన ఓటర్ల వివరాలు సరిగా లేవు. ఈ నెల 22న సాయంత్రం నుంచి ప్రచారం మొదలైంది. పార్టీల తరుపున అగ్ర నేతలు ప్రచారం చేశారు. అధికార టీఆర్​ఎస్​ పార్టీ నుంచి మంత్రులు డివిజన్లలో ప్రచారం చేశారు. సీఎం కేసీఆర బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అమిత్​షా, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగితో పాటు పలువురు ప్రచారం చేశారు. కాంగ్రెస్​ నుంచి టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​, వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి ప్రచారం చేశారు.a


Next Story

Most Viewed