- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రిడ్జ్‌లో తాత శవం.. ఓరుగల్లులో ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్
<p>దిశ ప్రతినిధి, వరంగల్/పరకాల : వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఒళ్లు గగ్గుర్పొడుచే సంఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన వృద్ధుడు బైరి బాలయ్య ఫ్రిడ్జ్ లో శవమై కనిపించాడు. దాదాపు కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండటం గమనార్హం. మనువడు నిఖిల్‌తో కలిసి ఉంటున్న బాలయ్య ఈ విధంగా మరణించడంపై స్థానికులు షాకయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన బైరి బాలయ్య(90) రిటైర్డ్ లెక్చరర్. కొడుకు హరికిషన్ పౌరహిత్యం వృత్తితో పరకాల పట్టణంలో […]</p>

దిశ ప్రతినిధి, వరంగల్/పరకాల : వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఒళ్లు గగ్గుర్పొడుచే సంఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన వృద్ధుడు బైరి బాలయ్య ఫ్రిడ్జ్ లో శవమై కనిపించాడు. దాదాపు కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండటం గమనార్హం. మనువడు నిఖిల్‌తో కలిసి ఉంటున్న బాలయ్య ఈ విధంగా మరణించడంపై స్థానికులు షాకయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన బైరి బాలయ్య(90) రిటైర్డ్ లెక్చరర్. కొడుకు హరికిషన్ పౌరహిత్యం వృత్తితో పరకాల పట్టణంలో సెటిల్ కావడంతో బాలయ్య ఆయన సతీమణి నర్సమ్మ, మనువడు నిఖిల్ ఇక్కడికి వచ్చేశారు. అయితే కొడుకు హరికిషన్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోడలు పదిహేనేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించింది.
బాలయ్య భార్య నర్సమ్మ కూడా మూడు నెలల క్రితం కరోనాతో కన్నుమూసింది. ఇక అప్పటి నుంచి బాలయ్య తీవ్ర మనోవేదనతో ఉంటున్నాడు. మనువడు నిఖిల్ పదో తరగతి వరకు చదువుకున్నా.. ఖాళీగా ఉండేవాడు. 25సంవత్సరాల వయస్సున్నా ఏ పని చేయకపోవడంతో ఎలా బతుకుతాడోనని బాధపడేవాడు. అయితే ఇటీవల కొద్దిరోజులుగా బాలయ్య ఇరుగు పొరుగుకు కనిపించకుండా పోయాడు. నిఖిల్‌ను అడిగినా సంబంధం లేని సమాధానాలు చెప్పేవాడు. మూడు రోజులుగా నిఖిల్ నివాసముంటున్న ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇంటి ఓనర్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన ఓనర్ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించి, ఫ్రిడ్జ్ డోర్ తీసేసరికి బాలయ్య మృతదేహం కనిపించడంతో షాక్ తిన్నాడు. మృతదేహాం దాదాపు కుళ్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
ఏం చేయాలో అర్థం కాక ఫ్రిజ్‌లో పెట్టా…: మనువడు నిఖిల్

తాతయ్య మూడు రోజుల క్రితం మరణించడంతో తనకు ఎవరూ తెలియకపోవడం వల్లనే ఏం చేయాలో అర్థంకాక శవాన్ని ఫ్రిడ్జ్‌లో దాటిచినట్లుగా నిఖిల్ చెబుతుండటం గమనార్హం. అయితే శవం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారం పదిరోజుల క్రితమే సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిల్ అమాయకత్వంతోనే అలా చేశాడా..? లేక హత్య చేసి ఏం చేయాలో అర్థం కాక ఫ్రిజ్‌లో శవాన్ని దాచాడా..? తాత శవంతోనే ఇంట్లో ఇన్ని రోజులు నిఖిల్ ఎలా ఉండగలిగాడు..? అదీ నిజంగా అమాయకత్వమేనా..? శవాన్ని మాయం చేసేందుకు యత్నమా..? అన్న పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.






