- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
76 ఏళ్ల వయసులో సిరిమల్లె పువ్వా…
by Vemula.Srinu Prasad |
<p>పదహారేళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పువ్వా అనే పాట వినగానే తెల్ల చీర కట్టుకుని అందంగా ఊయల ఊగుతున్న శ్రీదేవి గుర్తొస్తారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఉన్నది శ్రీదేవీ కాదు, ఉన్నావిడకు పదహారేళ్లు కాదు. ఆమె వయసు 76 సంవత్సరాలు. పేరు జయ. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన జయ, తన ఇంటి ముందు చెట్టుకు కట్టిన ఊయల ఊగుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 76 ఏళ్ల […]</p>

X
పదహారేళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పువ్వా అనే పాట వినగానే తెల్ల చీర కట్టుకుని అందంగా ఊయల ఊగుతున్న శ్రీదేవి గుర్తొస్తారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఉన్నది శ్రీదేవీ కాదు, ఉన్నావిడకు పదహారేళ్లు కాదు. ఆమె వయసు 76 సంవత్సరాలు. పేరు జయ.
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన జయ, తన ఇంటి ముందు చెట్టుకు కట్టిన ఊయల ఊగుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 76 ఏళ్ల వయసులో ఆమె జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాయి. ఒక చిన్నపిల్లలా మారి ఊయల మీద నిలబడి కూడా ఊగడం కొసమెరుపు.
Next Story






