ఈ అధికారులు మారరా..? భూమి కోసం బామ్మ పోరాటం..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-16 06:23:42  IST  )

<p>దిశ, బోధన్ : తన భర్త పేరుపై ఉన్న 20 గుంటల భూమిని ( సర్వే నంబర్ 379/35 ) ఇప్పించాలంటూ  నీరడి సాయమ్మ బోధన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షకు దిగారు. సాయమ్మకు వామపక్షల పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి నవీన్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలు సాయమ్మ మాట్లాడుతూ.. గత సంవత్సరం పాటుగా తహాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, మా భూమిని ఇప్పించడానికి అధికారులను  ఎన్నిసార్లు వేడుకున్నా.. [&hellip;]</p>

old women protest
X

దిశ, బోధన్ : తన భర్త పేరుపై ఉన్న 20 గుంటల భూమిని ( సర్వే నంబర్ 379/35 ) ఇప్పించాలంటూ నీరడి సాయమ్మ బోధన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షకు దిగారు. సాయమ్మకు వామపక్షల పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి నవీన్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలు సాయమ్మ మాట్లాడుతూ.. గత సంవత్సరం పాటుగా తహాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, మా భూమిని ఇప్పించడానికి అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా.. పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని నా పేరుపై చేసే వరకు దీక్షను విరమించేది లేదని ఆమె తెలిపారు.

Next Story