కరోనా వందేళ్లకోసారి వచ్చే పెను సంక్షోభం: మోడీ

by  |
కరోనా వందేళ్లకోసారి వచ్చే పెను సంక్షోభం: మోడీ
X

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వందేళ్లకోసారి వచ్చే పెను సంక్షోభమని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం ఆయన కేంద్ర మంత్రి మండలితో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రులలో బెడ్లు, ఆక్సిజన్ కొరత, నేటి నుంచి దేశంలో మొదలుకానున్న మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రధానంగా చర్చించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రులు వారి వారి రాష్ట్రాలలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని మోడీ సూచించారు. వారికి అవసరమైన సాయం చేస్తూ కొవిడ్‌ పరిస్థితులపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని మంత్రులతో అన్నారు.

కరోనా వైరస్ వందేళ్లకోసారి వచ్చే పెను సంక్షోభమని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కష్ట కాలంలో పేదలను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను (రేషన్, జన్‌ధన్ ఖాతాలలో నగదు) గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ (ఆరోగ్య) సభ్యుడు వికె పాల్ కొవిడ్-19 నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభణ తర్వాత కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Next Story

Most Viewed