జీఎస్టీ పరిధిలోకి విమాన ఇంధనం!

by  |
జీఎస్టీ పరిధిలోకి విమాన ఇంధనం!
X

దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి పౌరవిమానయాన శాఖ కృషి చేస్తోందని ఆ శాఖా కార్యదర్శి ప్రదీప్ సింగ్ వెల్లడించారు. గ్లోబల్ ఏవియేషన్-ఎయిర్ కార్గో అనే అంశంపై జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ప్రదీప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో విమానాల నిర్వహణకు ఏటీఎఫ్ ఖర్చులు 45-55 శాతంగా ఉన్నాయి. అంతర్జాతీయ దేశాలతో పోలిస్తే మన దేశమే అధికంగా ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది. ఈ అంశానికి సంబంధించి ఆర్థిక శాఖతో సంప్రదించినట్టు, జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయించాల్సి ఉన్నట్టు పేర్కొన్నారు. కరోనా పరిస్థితులను అధిగమించి దేశీయంగా పూర్తిస్థాయిలో విమానాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని, దేశీయంగా అనేక రంగాల మాదిరిగానే విమానయాన రంగం కుదేలైందని, అయినప్పటికీ సవాళ్లను అధిగమించిందని ప్రదీప్ సింగ్ చెప్పారు. ఈ రంగం కోలుకునేందుకు సరుకు రవాణా కీలకంగా మారిందని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed