వారికి ప్రభుత్వం చేయూత నివ్వాలి

by  |
వారికి ప్రభుత్వం చేయూత నివ్వాలి
X

దిశ, ముషీరాబాద్: లాక్ డౌన్ సందర్భంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, వారికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ఆచార్య కోదండరాం అన్నారు. ఇటీవల హిమాయత్ సాగర్, సితాఫల్ మండిలలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన గోపి, రవి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నాయి బ్రాహ్మణ యువశక్తి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్షను మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల పరిస్థతి చాల దుర్భరంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోకపోతే ఆత్మహత్యలు పెరిగిపోయే ప్రమాదముందని ఆయన అన్నారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి బడ్జెట్లో 250 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు మంజూరు చేయక పోవడం దారుణమన్నారు. వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు విద్యుత్ బిల్లుల్లో రాయితీలు ఇవ్వాలన్నారు. వారికి రుణాల వడ్డీని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed