రణ్‌వీర్ నువ్వు సూపర్ స్టార్ : గోవింద

by  |
రణ్‌వీర్ నువ్వు సూపర్ స్టార్ : గోవింద
X

దిశ, వెబ్‌డెస్క్: రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ యూత్ స్టార్. స్టైల్, స్వాగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ దక్కించుకున్న యూత్ ఐకాన్. ‘బ్యాండ్ బాజా బారత్’, ‘లుటేరా’, ‘రామ్ లీలా’, ‘బాజీరావ్ మస్తాని’, ‘పద్మావత్’, ‘సింబా’, ‘గల్లీబాయ్’ లాంటి సినిమాలతో సూపర్ అనిపించుకున్న రణ్ వీర్.. ఈ తరం బాలీవుడ్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటారు సినీ విశ్లేషకులు.

ఎప్పుడూ ఫుల్ జోష్‌గా కనిపించే ఈ హీరో .. ఏ ఈవెంట్‌కు వెళ్లినా, ఏ ప్రోగ్రామ్ చేసినా, చివరికి ఏ డ్రెస్ వేసుకున్న వైరల్ అవడం ఖాయం. అయితే ఈ మధ్య ఓ అవార్డ్ షోలో పెర్‌ఫార్మ్ చేసిన రణ్‌వీర్… ప్రోగ్రామ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన సూపర్ స్టార్ గోవిందపై ప్రశంసల వర్షం కురిపించాడు. నేను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు గోవింద కూడా ఒక కారణంగా చెప్పిన రణ్‌వీర్.. తను చేసిన సినిమాల వల్ల స్ఫూర్తిపొంది సినిమాల్లోకి వచ్చానని తెలిపారు.

అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించారు గోవింద. అవార్డ్ షోలో నీ డ్యాన్స్, నువ్వు నాపై చూపించిన అభిమానంతో నోట మాట రాలేదన్నారు. ఆ మూమెంట్‌లో ఆనందంతో ఏమీ మాట్లాడలేకపోయానని తెలిపారు. నిన్ను, నీ యాక్టింగ్‌ను మెచ్చుకునేందుకు నాకు పదాలు కూడా కరువయ్యాయన్న గోవింద.. నువ్వు బాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇంతకు ముందు కూడా నేను ఇదే చెప్పానని.. నువ్వు ఒక్కో మెట్టు ఎదగడం చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు.

tags : Ranveer Singh, Govinda, Gully Boy, Super Star

Next Story

Most Viewed