గవర్నర్ త్వరగా కోలుకోవాలి: ఉప రాష్ట్రపతి వెంకయ్య

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎ. నాగేశ్వర రెడ్డితో శుక్రవారం ఆయన ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యం గురించి నాగేశ్వర్ రెడ్డి ఉప రాష్ట్రపతికి తెలియజేశారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు. నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, త్వరలోనే ఆయన కోలుకొని డిశ్చార్జీ [&hellip;]</p>

venkaya naidu
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎ. నాగేశ్వర రెడ్డితో శుక్రవారం ఆయన ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యం గురించి నాగేశ్వర్ రెడ్డి ఉప రాష్ట్రపతికి తెలియజేశారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు. నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, త్వరలోనే ఆయన కోలుకొని డిశ్చార్జీ అవుతారని తెలియజేశారు.

Next Story