రాళ్లు విసిరితే నో జాబ్.. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

by  |
jammu-kashmir
X

న్యూఢిల్లీ, శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్ లో అల్లరి మూకలపై అక్కడి ప్రభుత్వం మరోసారి కన్నెర్ర చేసింది. ఇక నుంచి భద్రతా దళాలపై కి రాళ్లు రువ్వే కిరాయి మూకలకు ఎట్టి పరిస్థితుల్లో పాస్ పోర్ట్, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరాదని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక ఉత్తర్వును శనివారం సీనియర్ సూపర్నిండెంట్ ఆఫ్ పోలీస్, సీఐడీ, స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ కాశ్మీర్ విభాగాలు తమ తమ యూనిట్లకు జారీ చేశాయి.

వీరు రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించటంతో పాటు, అరాచకాలకు పాల్పడుతున్నందున పోలీస్ పరీశీలన( వెరిఫికేషన్) లో సహకరించరాదని నిర్ణయించారు. అలాంటి వారిపై పోలీస్ స్టేషన్లో ప్రత్యేక రికార్డ్ లను నిర్వహించాలని ఆదేశించారు. అల్లరి మూకలను గుర్తు పట్టేందుకు వీడియోలు, ఆడియోలు, ఫోటోగ్రాఫ్స్, ఇతర సామాజిక మాధ్యమాలను ఉపయోగించాలని సూచించారు. ఏదైన పరీశీలన సందర్భంగా వాటినే ప్రామాణికంగా తీసుకుని నివేదిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed