ఏపీలో ఇకపై ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ జీవోలు

by  |
apgovt
X

దిశ, ఏపీ బ్యూరో: అధికారికంగా విడుదలయ్యే జీవోలను ఆఫ్‌లైన్‌లోనే ఉంచాలన్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజలకు అందుబాటులో లేకుండా జీవోలను నిలిపివేయడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.

జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపివేయడం వల్ల సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, ఇతర అంశాలను, గోప్యంగా ఉంచాల్సిన అంశాలను కూడా ఈ-గెజిట్ లో ఉంచబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక నుంచి అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో జారీ అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్‌ ఆదిత్యానాథ్‌ దాస్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed