ప్రైవేట్ విద్యావ్యవస్థను ఆదుకోవాలి

by  |
ప్రైవేట్ విద్యావ్యవస్థను ఆదుకోవాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా సంక్షోభంలో ఉన్న ప్రైవేట్ విద్యా వ్యవస్థను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కోరింది. గత 4నెలలుగా ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక తీవ్రఇబ్బందులు పడుతున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు పాపిరెడ్డి అన్నారు. కరోనా ప్రభావంతో 4లక్షల మంది ఉపాధ్యాయులతో పాటు 12వేల మంది కరస్పాండెంట్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 -20 విద్యా సంవత్సరంలో 15నుంచి 25శాతం ఫీజు బకాయిలు రావాల్సి ఉందని, స్కూల్స్ భవనాల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థల విషయంలో ఒక విధంగా, బడ్జెట్ స్కూల్స్ విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆన్‌లైన్ క్లాస్ విషయాల్లో కార్పొరేట్ స్కూల్స్ లకు అనుమతి ఇస్తూ తమ బడ్జెట్ ప్రేవేట్ స్కూళ్లకు నిర్వహించవద్దంటూ హుకూం జారీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన విద్యా సంవత్సర అడ్మిషన్లు , తరగతుల నిర్వహణ , ఫీజుల విషయంలో మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed