- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్దె భవనాల్లో మెడికల్ కాలేజీల హాస్టళ్లు..
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో కొత్తగా వస్తాయనుకుంటున్న 7 మెడికల్ కాలేజీల హాస్టళ్లను అద్దె భవనాల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమీషన్) విజిట్ సమీపిస్తుండడంతోనే మొదటి సంవత్సరం అద్దె భవనాల్లోనే హాస్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం సూచించినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. అంతేగాక తాత్కాలిక భవనాల్లోనే తరగతులు కూడా నిర్వహించాలని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎన్‌ఎంసీ విజిట్‌కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో కాలేజీలకు, హాస్టళ్లకు తాత్కాలికంగా భవనాలను చూడాలని ప్రభుత్వం […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో కొత్తగా వస్తాయనుకుంటున్న 7 మెడికల్ కాలేజీల హాస్టళ్లను అద్దె భవనాల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమీషన్) విజిట్ సమీపిస్తుండడంతోనే మొదటి సంవత్సరం అద్దె భవనాల్లోనే హాస్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం సూచించినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. అంతేగాక తాత్కాలిక భవనాల్లోనే తరగతులు కూడా నిర్వహించాలని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎన్‌ఎంసీ విజిట్‌కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో కాలేజీలకు, హాస్టళ్లకు తాత్కాలికంగా భవనాలను చూడాలని ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు సూచించింది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వీటిని సమకూర్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీల అనుమతి దరఖాస్తుకు కూడా కేవలం నెల రోజుల సమయం ఉండటంతో అధికారుల్లో గందరగోళం నెలకొన్నది. అనుకున్న సమయానికి పూర్తి చేస్తామో లేదోనని టెన్షన్ పడుతున్నారు.
పర్మినెంట్ రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి చూపని ప్రభుత్వం..
కొత్తగా మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, మ్యాన్ పవర్ పూర్తిగా సమకూరితేనే ఎన్‌ఎంసీ అనుమతులు ఇస్తుంది. అయితే ఎన్ఎంసీ వచ్చే నాటికి సిబ్బంది కొరత రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్లను నియమించుకోవాలని భావిస్తున్నది. ఏడు కాలేజీల్లో 377 ప్రొఫెసర్లను రిక్రూట్‌చేయనుంది. అయితే స్పెషాలిటీలో ఆసక్తి కలిగిన వారిలో 115 మంది డీఎంఈకి సరెండర్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో 262 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనుంది.
పాత కాలేజీల ప్రిన్సిపాల్స్‌కి నిర్వహణ బాధ్యతలు..
కొత్త కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్ వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పాత కాలేజీల ప్రిన్సిపాల్స్, వాటికి అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల సూపరింటెండ్లకు ప్రభుత్వం సూచించింది. ఎయిమ్స్ తరహాలో అన్ని వసతులు, మౌలిక సౌకర్యాలు, మ్యాన్ పవర్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించింది. అంతేగాక కొత్త కాలేజీలు అందుబాటులోకి వచ్చినా.. పాత కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు కొత్త వాటిలో ఒక్కొ దాని బాధ్యతలను అప్పజెప్తున్నట్లు సమాచారం.






