వివరణ ఇవ్వండి.. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్‌కు సర్కార్ నోటీసులు

71
Assistant Commissioner Shanthi

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో దేవాదాయ శాఖ అధికారుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ కమిషనర్‌ పుష్ఫవర్ధన్‌పై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఇసుకతో దాడి చేశారు. ఈ దాడి విజువల్స్‌ ఆఫీసులోని సీసీ కెమెరాలో క్లియర్‌గా రికార్డు అయ్యాయి. దీంతో ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీసీ పుష్పవర్ధన్ మొహంపై ఇసుక కొట్టడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం అసిస్టెంట్ కమిషనర్ శాంతిని కోరింది. తొమ్మిది అంశాంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అంతేగాకుండా.. గతంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి వైఖరికి నిరసనగా ఉద్యోగులందరూ సామూహికంగా సెలవులు పెట్టిన విషయం తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..