- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్జాగా ప్రభుత్వ అసైన్డ్ భూమి కబ్జా..!
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: ప్రభుత్వ అసైన్డ్ భూమి కనిపిస్తే అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారని అక్కన్నపేట బీజేపీ మండలాధ్యక్షులు గొల్లపల్లి వీరాచారి అన్నారు. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ శివారులో ఓ వ్యక్తి ప్రభుత్వ అసైన్డ్ భూమిని చదును చేస్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను పరిరక్షించేందు చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ […]</p>

X
దిశ, హుస్నాబాద్:
ప్రభుత్వ అసైన్డ్ భూమి కనిపిస్తే అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారని అక్కన్నపేట బీజేపీ మండలాధ్యక్షులు గొల్లపల్లి వీరాచారి అన్నారు. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ శివారులో ఓ వ్యక్తి ప్రభుత్వ అసైన్డ్ భూమిని చదును చేస్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను పరిరక్షించేందు చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన తహశీల్దార్ వేణుగోపాల్ రావు.. రేగొండలో ప్రభుత్వ భూమిని చదును చేయించిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story






