వారిని ఆదుకోవాలి….

by  |
వారిని  ఆదుకోవాలి….
X

దిశ ప్రతినిధి, నల్లగొండ :
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఆయన మునుగోడు మండల కేంద్రంలో ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంత్రిత పంటలను సాగు చేయాలని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవకుండా, పత్తిని కొనుగోలు చేయకపోవడం చూస్తుంటే దళారులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందా అనే అనుమానాలు రేకెత్తు తున్నాయని తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలని టీఆర్‌ఎస్ చూస్తోందని, అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇంటికి రూ.10వేలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఓటు రాజకీయం తప్ప.. కేసీఆర్‌కు మరో ఆలోచనలు రావడం లేదా అని ప్రశ్నించారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు చేతులు వస్తాయి కానీ, రైతులను ఆదుకునేందుకు చేతులు ఎందుకు రావడం లేదని ఆయన అన్నారు.

Next Story

Most Viewed