- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన ఆపద్బాంధవుడు
<p>దిశ, ఆదిలాబాద్: ఆయన ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హెల్త్ సూపర్ వైజర్. తన వృత్తిని దైవంగా భావిస్తాడు. ఓ నిండు గర్భిణికి నొప్పులు రావడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించాడు. అంతేకాకుండా అత్యవసరంగా అదే గర్భిణికి రక్తం అవసరంమవ్వడంతో తానే రక్తదానం చేసిన ఆమె ప్రాణాలను కాపాడాడు. ఇంతకీ ఆయన ఎవ్వరో కాదు.. కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్ జె.గోపాల్. మారుమూల అటవీ ప్రాంతమైన గంగాపూర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి మౌనికకు […]</p>

దిశ, ఆదిలాబాద్: ఆయన ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హెల్త్ సూపర్ వైజర్. తన వృత్తిని దైవంగా భావిస్తాడు. ఓ నిండు గర్భిణికి నొప్పులు రావడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించాడు. అంతేకాకుండా అత్యవసరంగా అదే గర్భిణికి రక్తం అవసరంమవ్వడంతో తానే రక్తదానం చేసిన ఆమె ప్రాణాలను కాపాడాడు. ఇంతకీ ఆయన ఎవ్వరో కాదు.. కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్ జె.గోపాల్. మారుమూల అటవీ ప్రాంతమైన గంగాపూర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి మౌనికకు శనివారం నొప్పులు రావడంతో సమాచారం తెలుసుకున్న గోపాల్.. ఆమె సురక్షితంగా నిర్మల్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానాకు తరలించాడు. ప్రసవ సమయంలో ఆమెకు రక్తం అవసరమని డాక్టర్లు చెప్పడంతో వెంటనే రక్తదానం చేసిన ఈ నిండు గర్భిణి ప్రాణాలనూ కాపాడాడు. ఒకవైపు వృత్తి ధర్మం నిర్వర్థిస్తూనే… మరో వైపు మానవతా దృక్పథంతో రక్తదానం చేసిన హెల్త్ సూపర్ వైజర్ గోపాల్‌ను అందరూ అదర్శంగా తీసుకోవాలి.






