- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
G Pay : బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే రూ.500 మీవే
<p>దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పటికప్పుడు ఆఫర్లు, స్క్రాచ్ కార్డులతో యూజర్లను మెప్పిస్తున్న ఆన్లైన్ పేమెంట్ యాప్ ‘గూగుల్ పే’ మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. మొదట్లో యూజర్లను మెప్పించేందుకు స్క్రాచ్ కార్డుల ద్వారా డబ్బుల ఆశ చూపి మెల్లమెల్లగా బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అంటూ అందరినీ నిరాశ పరిచింది. ఆ తర్వాత ఏదో ఓ కంపెనీకి చెందిన ఆఫర్స్ ఇచ్చింది. ఈ క్రమంలో యూజర్‌లకు ఇంట్రెస్ట్ పోతుందన్న విషయం గ్రహించి మరో భారీ స్కెచ్ వేసింది. ప్రస్తుతం […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పటికప్పుడు ఆఫర్లు, స్క్రాచ్ కార్డులతో యూజర్లను మెప్పిస్తున్న ఆన్లైన్ పేమెంట్ యాప్ ‘గూగుల్ పే’ మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. మొదట్లో యూజర్లను మెప్పించేందుకు స్క్రాచ్ కార్డుల ద్వారా డబ్బుల ఆశ చూపి మెల్లమెల్లగా బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అంటూ అందరినీ నిరాశ పరిచింది. ఆ తర్వాత ఏదో ఓ కంపెనీకి చెందిన ఆఫర్స్ ఇచ్చింది. ఈ క్రమంలో యూజర్‌లకు ఇంట్రెస్ట్ పోతుందన్న విషయం గ్రహించి మరో భారీ స్కెచ్ వేసింది.
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా.. ఐపీఎల్ హవా నడుస్తుండటంతో క్రికెట్ ప్రియులను ఆకర్షించేలా ఓ స్క్రాచ్ కార్డు గేమ్‌ని ముందుకు తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో ఆరు బాల్స్‌ని కలెక్ట్ చేస్తే రూ.500 వరకు గెలిచే ఓ స్క్రాచ్ కార్డ్ వస్తుంది. గూగుల్ పే యాప్ ద్వారా రీచార్చ్ చేస్తే ఓ బాల్‌ని గెలుచుకోవచ్చు. ఇలా ఆరు సార్లు రీచార్జ్ చేస్తే స్క్రాచ్ కార్డు వస్తుంది. మరింకేం ఈ గేమ్‌ని ఆడేసి రూ.500 వరకు గెలుచుకోండి.ఇక ఆట మీదే..!






