- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే ట్రాక్‌పై కారు.. ఢీ కొట్టిన రైలు
<p>దిశ, ఏపీ బ్యూరో: రైల్వే ట్రాక్‌పై సాంకేతిక లోపంతో నిలిచిపోయిన కారును ఓ రైలు ఇంజిన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు వద్ద శనివారం జరిగింది. రైల్వే ట్రాక్‌ను క్రాస్ చేస్తున్న సమయంలో సాంకేతిక లోపంతో కారు పట్టాలపై నిలిచిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో అటుగా వచ్చిన రైలు కారును ఢీ కొట్టి.. కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రైల్వే ట్రాక్‌పై సాంకేతిక లోపంతో నిలిచిపోయిన కారును ఓ రైలు ఇంజిన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు వద్ద శనివారం జరిగింది. రైల్వే ట్రాక్‌ను క్రాస్ చేస్తున్న సమయంలో సాంకేతిక లోపంతో కారు పట్టాలపై నిలిచిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో అటుగా వచ్చిన రైలు కారును ఢీ కొట్టి.. కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు వై.కోడూరుకు చెందిన నాగిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story






