- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త జోనల్ విధానంలో భాగంగా జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించేందుకు విధివిధానాలు ఖరారయ్యాయి. దీనిపై సోమవారం ఉదయం ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్నవారు తమ సొంత జిల్లా లేదా అందులోని మరో జిల్లాను ఎంచుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, దివ్యాంగులు, భార్యాభర్తలు, వితంతువులు, కారుణ్య […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త జోనల్ విధానంలో భాగంగా జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించేందుకు విధివిధానాలు ఖరారయ్యాయి. దీనిపై సోమవారం ఉదయం ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్నవారు తమ సొంత జిల్లా లేదా అందులోని మరో జిల్లాను ఎంచుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, దివ్యాంగులు, భార్యాభర్తలు, వితంతువులు, కారుణ్య నియామకాల్లోని వారి కోసం ఆప్షన్లు కల్పిస్తారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులకు కేడర్ల వారీ ఆప్షన్లు ఇచ్చి కేటాయింపు అవకాశం కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలో.. జిల్లా కేడర్ పోస్టులకు రేపటి నుంచే ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు..
జోనల్ విధానం అమలులో భాగంగా రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయగా వికాస్‌రాజ్ కన్వీనర్‌గా, ప్రభుత్వ సలహాదారు శివశంకర్, వివిధ శాఖల అధిపతులు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. పాత జిల్లాల పరిధి, కొత్త జిల్లాల ప్రకారం ఆప్షన్లను జీవోలో వెల్లడించారు.
ప్రభుత్వ అధికారిక జోవో.. Click Here
- Tags
- Good news






