- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన నీతి ఆయోగ్.. త్వరలో..
<p>దిశ, భూపాలపల్లి: ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలో నీతి ఆయోగ్ బృందం పర్యటించింది. ఘన్పూర్ మండలం చెల్పూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన మహిళా రైతులతో ముఖాముఖిలో పాల్గొని వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ ద్వారా జిల్లాలో మిర్చి పంట సాగు, మార్కెటింగ్ విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా పంచాయతీ, ఆర్ డబ్య్లూఎస్, ఐసీడీఎస్, మహిళా సంఘాలు, పశుసంవర్ధకశాఖ వారిచే ఏర్పాటు చేసిన […]</p>

దిశ, భూపాలపల్లి: ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలో నీతి ఆయోగ్ బృందం పర్యటించింది. ఘన్పూర్ మండలం చెల్పూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన మహిళా రైతులతో ముఖాముఖిలో పాల్గొని వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ ద్వారా జిల్లాలో మిర్చి పంట సాగు, మార్కెటింగ్ విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా పంచాయతీ, ఆర్ డబ్య్లూఎస్, ఐసీడీఎస్, మహిళా సంఘాలు, పశుసంవర్ధకశాఖ వారిచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.
అనంతరం రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలని మహిళా మిర్చి రైతులు సంకల్పించడం అభినందనీయమన్నారు. మిర్చిని పౌడర్ రూపంలో అమ్మితే రైతులు అదనపు లాభాలు పొంది ఆర్థికంగా ఎదుగుతారని సూచించారు. మహిళా మిర్చి రైతులకు చిల్లి కూలింగ్ యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి రైతులను ప్రోత్సహించి.. అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పోత్రు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అదనపు కలెక్టర్లు టీఎస్. దివాకర, ఇలా త్రిపాఠీ, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, జెడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీఓ పురుషోత్తం, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, సీపీఓ శామ్యూల్, డీపీఓ ఆశా లత, హార్టికల్చర్ అధికారి అక్బర్, పశుసంవర్ధకశాఖ అధికారి డా. కుమారస్వామి, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, చెల్పూర్ సర్పంచ్ నడిపల్లి మధుసూదనరావు, ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ మహిళా రైతులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.






