కీర్తి 'గుడ్ లక్ సఖి' టీజర్

by  |
కీర్తి గుడ్ లక్ సఖి టీజర్
X

ఇండిపెండెన్స్ డే కానుకగా ‘గుడ్ లక్ సఖి’ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. తెలుగు, తమిళ్, మలయాళీ భాషల్లో తెరకెక్కిన సినిమా టీజర్ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయగా.. తమిళ్ వెర్షన్‌ను విజయ్ సేతుపతి.. మలయాళీ టీజర్‌ను పృథ్వీరాజ్ విడుదల చేశారు.

ఓ పల్లెటూరికి చెందిన అమ్మాయికి ప్రతీ విషయంలోనూ బ్యాడ్ లక్ ఎదురవుతుంది. చివరకు పెళ్లి రోజున పెళ్లి కొడుకుకు ప్రమాదం జరగడం, మ్యారేజ్ ఆగిపోవడంతో తన దురదృష్టమే అని ఊరివాళ్లంతా బ్యాడ్ లక్ సఖి అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఓ వ్యక్తి దేశం కోసం షూటర్స్‌ను తయారు చేసేందుకు ముందుకు వస్తారు. అందులో ఈ పల్లెటూరి సఖి కూడా ట్రైన్ అవుతుంది. కానీ ఎప్పుడూ తనను వెంటాడే బ్యాడ్ లక్‌తో ఆ యువతి దేశానికి మెడల్ తీసుకురాగలిగిందా? అనేది కథ. పల్లెటూరి పిల్లగా కీర్తి ఎప్పటిలాగే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వగా.. ఆది పినిశెట్టి.. కీర్తికి సపోర్ట్ చేసే లవర్‌గా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక జగపతి బాబు ట్రైనర్‌గా తన నటనతో అలరించేందుకు మరోసారి సిద్దమయ్యారు.

నగేష్ కుకునూరు దర్శకత్వంలో వస్తున్న ఈ ట్రై లింగువల్ సినిమాను సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. శ్రావ్య వర్మ సహనిర్మాత కాగా.. రాక్ స్టార్ శ్రీదేవి అదిరిపోయే సంగీతం అందించారు.


Next Story

Most Viewed