భగ్గుమన్న బంగారం!

by  |
భగ్గుమన్న బంగారం!
X

దిశ, సెంట్రల్ డెస్క్: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.47,865 పలికింది. వెండి కూడా బంగారం బాటలోనే 3 శాతం పెరిగి కిలో రూ.48,208 వద్ద ట్రేడవుతోన్నది. వారం రోజుల్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధర 3.40 శాతం, వెండి దాదాపు 8 శాతం పెరిగింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అమెరికా, జపాన్ దేశాల బలహీన ఎకనమిక్ డేటా తదితర కారణాలతో సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బంగారం ధరలు కొండెక్కాయి.

హైదరాబాద్‌లో ధరెంతంటే..

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,480కు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ.48,550కు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ వారంలోనే బంగారం ధరలు రూ. 50 వేల మార్కును చేరుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ధరతో పాటు వెండి కూడా భారీగా పెరిగి కిలో రూ.46,720 కు చేరుకుంది. పరిశ్రమల విభాగాలు, నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.


Next Story