ఆ మాస్కుకు అక్షరాల రూ.11కోట్లు

by  |
ఆ మాస్కుకు అక్షరాల రూ.11కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో సహజీవనం మొదలయ్యాక అందరూ దాని బారిన పడుకుండా ఉండేందకు జాగ్రత్తలు పాటిస్తున్నారు.బయటకు వెళితే మాస్కులేకుండా వెళ్లేందుకు జంకుతున్నారు. సాధారణ ప్రజలు ఇంట్లో తయారు చేసినవి లేదా మెడికల్ షాపులో దొరికే మాస్కులు ధరిస్తుంటే.. డబ్బులున్న బడా బాబులు మాత్రం రూ. లక్షలు,కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా మాస్కులు తయారు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ బడాబాబు ఏకంగా రూ.11కోట్లుతో బంగారంతో పాటు వజ్రాలతో కూడిన మాస్కు తయారు చేయించుకున్నాడు. ఇజ్రాయిల్‌కు చెందిన ఓ వక్తి తమ వద్ద ఈ మాస్కును తయారు చేయించుకున్నట్టు తయారీదారు ఇసాక్ లావేయ్ తెలిపారు.

ఈ మాస్కును నగల తయారీ సంస్థ అయిన యవెన్ కంపెనీ బంగారం, వజ్రాలను కలిపి తయారు చేసిందన్నారు. దానికి 18 క్యారట్ల తెల్ల బంగారం, 3,600 తెల్ల, నల్ల డైమండ్లను ఉపయోగించి డిజైన్ చేశారని వివరించారు. చూడగానే మిలమిలా మెరిసిపోతుందని చెప్పారు. అంతేకాదు ఈ మాస్క్‌కు N99 ఫిల్టర్లను కూడా అమర్చారు. మాస్కు ఖరీదు రూ.11కోట్లు అని తెలీయడంతో అందరూ నోరెల్లబెడుతున్నారు.



Next Story

Most Viewed