ఎరువుల మందు తిని మేకలు మృతి

5

దిశ, వెబ్‎డెస్క్ :
ఎరువుల మందు తిని 22 మేకలు మృతి చెందాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని భీమ్‎గల్ మండలంలోని పురాణీపేట్‎లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పురాణీపేట్‎లోని మెండి శారదకు చెందిన మేకల మంద లింబాద్రి గుట్ట పరిసర ప్రాంతాల్లోకి మేతకు వెళ్లింది. అక్కడ పంట పొలాల వద్ద వాడి పడేసిన పొటాష్‌, యూరియాను మేకలు తినడంతో అవి పడిపోయాయి. దీంతో మేకలు కాస్తున్న శారద కుమారుడు అర్వింద్‌ తల్లికి తెలపడంతో వెంటనే భీమ్‌గల్‌ పశు వైద్యశాలకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అప్పటికే 22 మేకలు మృతి చెందగా.. మూడు మేకలు ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకున్నాయి. సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితురాలు శారద వాపోయారు.