షాకింగ్: మేకపై ఐదుగురు అత్యాచారం.. ప్రధానిపై నెటిజన్స్ ఫైర్..

by  |
goat rape
X

దిశ, వెబ్‌డెస్క్: కామాంధులు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. మనుషులపైనే కాకుండా మూగజీవాలపై కూడా వారి లైంగికవాంఛ తీర్చుకుంటున్నారు. ఐదుగురు యువకులు ఓ మేకను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండ ఆ మేకను చంపేంసి పరారయ్యారు.. జుగుప్సాకరమైన ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మేకపై లైంగిక దాడికి పాల్పడి చంపేసినట్లు నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల ఓ అత్యాచార ఘటనపై స్పందించిన ఇమ్రాన్.. మహిళల వస్త్రధారణ కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఇమ్రాన్ మాటలపై అయన మాజీ భార్య సైతం అగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ మేక ఏ విధంగా కామాంధులను రెచ్చగెట్టింది అంటూ ఇమ్రాన్ ను నిలదీస్తున్నారు.


Next Story

Most Viewed