మార్గదర్శకాలు పాటిస్తాం.. అనుమతి ఇవ్వండి

by Shyam |

<p>దిశ, ఎల్బీనగర్: తెలంగాణలో జిమ్ సెంటర్లను పునరుద్ధరించాలని ఎల్బీనగర్ నియోజకవర్గ జిమ్ ఓనర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం కొత్తపేటలోని లైఫ్ ఫిట్‌నెస్ సెంటర్‌‌లో అడాల యాదగిరి, అడాల శ్రీను ఆధ్వర్యంలో జిమ్ యజమానుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిమ్‌లో పనిచేసే సిబ్బంది జీతాలు, మెయింటనెన్స్, ఎక్యూప్మెంట్ ఈఎంఐలు, కరెంట్ బిల్లులు కలుపుకోని రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తుందన్నారు. జిమ్ సెంటర్ల నిర్వహణకు అనుమితిస్తే ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి నడిపిస్తామన్నారు. ప్రతి జిమ్ సెంటర్‌లో థర్మల్ [&hellip;]</p>

మార్గదర్శకాలు పాటిస్తాం.. అనుమతి ఇవ్వండి
X

దిశ, ఎల్బీనగర్: తెలంగాణలో జిమ్ సెంటర్లను పునరుద్ధరించాలని ఎల్బీనగర్ నియోజకవర్గ జిమ్ ఓనర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం కొత్తపేటలోని లైఫ్ ఫిట్‌నెస్ సెంటర్‌‌లో అడాల యాదగిరి, అడాల శ్రీను ఆధ్వర్యంలో జిమ్ యజమానుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిమ్‌లో పనిచేసే సిబ్బంది జీతాలు, మెయింటనెన్స్, ఎక్యూప్మెంట్ ఈఎంఐలు, కరెంట్ బిల్లులు కలుపుకోని రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తుందన్నారు. జిమ్ సెంటర్ల నిర్వహణకు అనుమితిస్తే ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి నడిపిస్తామన్నారు. ప్రతి జిమ్ సెంటర్‌లో థర్మల్ స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేసి, ప్రతి రెండు గంటలకోసారి శానిటేషన్ చేస్తామన్నారు. సమావేశంలో జిమ్ సెంటర్ల యజమానులు బోడ శ్రావణ్ కుమార్, బుర్ర రవి, ప్రకాష్, వజ్రం రెడ్డి, జ్ఞానేశ్వర్, భాస్కర్ రెడ్డి, తారా రాజ్కిరణ్, జయసింహా తదితరులు పాల్గొన్నారు.

Next Story