తల్లీకూతురితో కానిస్టేబుల్ రాసలీలలు.. నగ్నంగా బెడ్ పై అడ్డంగా దొరికి

523

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పరాయి వారి మోజులో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నవారు ఉండడం తలదించుకోవాల్సిన విషయం. పలువురికి బుద్దిచెప్పాల్సిన పోలీసులు సైతం ఈ వివాహేతర సంబంధాలకు అలవాటు పడి నిందితులుగా మారుతుండడం సమాజం సిగ్గుపడాల్సిన విషయం. తాజాగా ఒక కానిస్టేబుల్ తల్లికూతురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన జార్ఖండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. రాంచీకి చెందిన నవీన్(26) అనే యువకుడు  స్థానిక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గతకొంతకాలం క్రితం అతనికి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్తతో విడాకులు తీసుకొని తల్లితో కలిసి నివాసముంటోంది. నవీన్ తరుచు మహిళ ఇంటికి వెళ్లేవాడు. ఇక ఆ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం మహిళ తల్లికి కూడా తెలుసు. దీంతో వారి రాసలీలలకు అడ్డులేకుండా పోయింది. ఇక ఈ నేపథ్యంలోనే తరుచు ఇంటికి వస్తున్న నవీన్ మహిళ లేని సమయంలో ఆమె తల్లిని కూడా లొంగదీసుకున్నాడు. కూతురికి తెలియకుండా తల్లితో కామక్రీడలు కొనసాగించడం మొదలుపెట్టాడు.

ఇక ఈ క్రమంలో శనివారం మహిళ బయటికి వెళ్లడంతో ఆమె తల్లితో నవీన్ కామక్రీడలలో మునిగితేలాడు. అదే సమయానికి కూతురు ఇంటికి రావడం, తన తల్లితో ప్రియుడు నగ్నంగా కనిపించడంతో షాకయ్యింది. ఇద్దరిపై కోపంతో అరిచింది. దీంతో ముగ్గురు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో కోపాద్రిక్తుడైన నవీన్ తన దగ్గర ఉనన్ గాన్ తో మహిళ ను షూట్ చేశాడు.  అయితే.. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ ఆ మహిళ తలకు కాకుండా గోడకు తగలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..