- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలిక పై అత్యాచారం.. ఆపై కత్తులతో దాడి!
<p>దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడిన నలుగురు దుండగులు మైనప్ పై అత్యాచారం చేశారు. ఆపై కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. ఈ ఘటన ఢిల్లీలోని పశ్చిమ విహార్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఆ సమయంలో మైనర్ ఒంటరిగా ఉండటం గమనించి నలుగురు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను బయటకు రాకుండా బంధించి లైంగికిదాడికి పాల్పడ్డారు. […]</p>

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడిన నలుగురు దుండగులు మైనప్ పై అత్యాచారం చేశారు. ఆపై కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. ఈ ఘటన ఢిల్లీలోని పశ్చిమ విహార్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఆ సమయంలో మైనర్ ఒంటరిగా ఉండటం గమనించి నలుగురు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను బయటకు రాకుండా బంధించి లైంగికిదాడికి పాల్పడ్డారు. అనంతరం కత్తులతో పొడిచారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బాలిక గాయాలతో బయటకు వచ్చింది. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. కాగా, గురువారం సీఎం కేజ్రీవాల్ బాధితురాలిని, కుటుంబ సభ్యులను పరామర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటనపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. అంతేకాకుండా, రూ. 10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.






