ప్రేమించట్లేదని 14 ఏళ్ల బాలికను చంపేసిన 22 ఏళ్ల యువకుడు

125
Pune-case

దిశ, వెబ్ డెస్క్: తనని ప్రేమించడంలేదని 14 ఏళ్ల బాలికను 22 ఏళ్ల యువకుడు రోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన పూణేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణేలోని బిబ్వేవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కబడ్డీ స్టేడియానికి 14 ఏళ్ల ఓ బాలిక రోజూ వచ్చి కబడ్డీ ప్రాక్టీస్ చేసుకుంటుంది. ప్రతి రోజూ మాదిరిగానే మంగళవారం సాయంత్రం కూడా ఆ బాలిక స్టేడియానికి వచ్చి కబడ్డీ ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత స్టేడియం నుంచి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో బైకులపై ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆమెపై కత్తులతో దారుణంగా దాడి చేశారు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతిచెందింది.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, వారిద్దరూ మైనర్లే అని పోలీసులు చెప్పారు. అదేవిధంగా ప్రధాన నిందితుడైన శుభమ్ భగవత్(22) పరారీలో ఉన్నాడని, అతను బాలికకు దూరపు చుట్టం అవుతాడని, అతను కొద్దిరోజులపాటు బాలిక ఇంట్లోనే ఉన్నాడని, ఈ క్రమంలోనే బాలికపై అతను ప్రేమ పెంచుకున్నాడని, ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు అతడిని వారి ఇంటి నుంచి పంపించారని పోలీసులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..