ప్రేమించలేదని.. యువతి దారుణ హత్య

6

దిశ, వెబ్‌డెస్క్ : బెజవాడలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటన జిల్లాలోని మాచవరంలో గురువారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. ఇంజినీరింగ్ చదువుతున్న దివ్య తేజస్విని తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో నాగేంద్రబాబు అనే వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి మరీ మెడపై కత్తితో దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, గత కొంతకాలంగా తేజస్వినిని ప్రేమ పేరుతో నాగేంద్రబాబు వేధిస్తున్నాడని సమాచారం. తనను ప్రేమించడం లేదని కక్ష పెంచుకున్న ఆ ఉన్మాది ఆమెపై దాడి చేసిన అనంతరం తనను తాను గాయపరుచుకున్నాడు. వెంటనే అతన్ని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.