- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్‌తో బాలిక మృతి, విషమంగా బాలుడు
<p>దిశ, మంగపేట : కరెంట్ షాక్ తగిలి మండల కేంద్రానికి చెందిన వీఆర్ఏ దాసరి రాము.. కూతురు అమృత వర్షిని (11) మృతి చెందగా కుమారుడు చరణ్ పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో రాము కుటుంబం నివాసముంటుంది. సాయంత్రం 4 గంటల సమయంలో రాము కూతురు అమృత వర్షిని, కుమారుడు చరణ్‌లు ఇంటి పక్కనే మూడు రోజులుగా మూసి ఉన్న బిర్యానీ హోటల్లో ఆడుకోవడానికి వెళ్లారు. ఈ […]</p>

దిశ, మంగపేట : కరెంట్ షాక్ తగిలి మండల కేంద్రానికి చెందిన వీఆర్ఏ దాసరి రాము.. కూతురు అమృత వర్షిని (11) మృతి చెందగా కుమారుడు చరణ్ పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో రాము కుటుంబం నివాసముంటుంది. సాయంత్రం 4 గంటల సమయంలో రాము కూతురు అమృత వర్షిని, కుమారుడు చరణ్‌లు ఇంటి పక్కనే మూడు రోజులుగా మూసి ఉన్న బిర్యానీ హోటల్లో ఆడుకోవడానికి వెళ్లారు.
ఈ సందర్భంగా హోటల్‌లోని కరెంట్ తీగలు తగిలి ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కూతురు అమృత వర్షిణి మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏటూరునాగారంలోని ప్రైవేటు ఆసుప్రతికి తరలించినట్లు తెలిపారు. అల్లారు ముద్దుగా ఆడుకునే పిల్లలు కరెంట్ షాక్‌తో విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు, బందువులు విషాదంలో మునిగిపోయారు.






