- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పినపాకను వెంటాడుతోన్న డెంగ్యూ.. యువతి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మణుగూరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో డెంగ్యూ జ్వరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విషజ్వరాలు నియోజకవర్గంలోని ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి. గత రెండు, మూడు నెలల నుంచి డెంగ్యూ జ్వరంతో పలువురు మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అశ్వాపురం మండలం హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగి బొలిశెట్టి శ్రీనివాస్ కూతురు గత నాలుగు రోజుల నుంచి డెంగ్యూ ఫీవర్‌తో బాధపడినట్టు సమాచారం. అయితే, డెంగ్యూ జ్వరం తీవ్రం కావడంతో […]</p>

X
దిశ, మణుగూరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో డెంగ్యూ జ్వరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విషజ్వరాలు నియోజకవర్గంలోని ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి. గత రెండు, మూడు నెలల నుంచి డెంగ్యూ జ్వరంతో పలువురు మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అశ్వాపురం మండలం హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగి బొలిశెట్టి శ్రీనివాస్ కూతురు గత నాలుగు రోజుల నుంచి డెంగ్యూ ఫీవర్‌తో బాధపడినట్టు సమాచారం.
అయితే, డెంగ్యూ జ్వరం తీవ్రం కావడంతో హైద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు కిమ్స్ హాస్పిటల్‌లో మృతి చెందినట్టు తెలిసింది. కళ్ల ముందే కూతురు డెంగ్యూతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story






