- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరిఖనిలో దారుణం.. కత్తిపీటతో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు
<p>దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని గొంతు కోసి దారుణంగా హతమార్చాడో ప్రియుడు. ఈ ఘటన జిల్లాలోని గోదావరిఖని పట్టణం 8 ఇంక్లైన్ కాలనీలోని కేకే నగర్‌లో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కేకే నగర్‌లో నివాసముంటున్న అంజలి అనే యువతిని ప్రియుడే కూరగాయలు కోసే కత్తి పీటతో నరికి చంపాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది. నిందితుడు కూడా అదే కాలనీలో నివాసముంటున్నట్టు తెలుస్తోంది. అమ్మాయి ఇంట్లో […]</p>

X
దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని గొంతు కోసి దారుణంగా హతమార్చాడో ప్రియుడు. ఈ ఘటన జిల్లాలోని గోదావరిఖని పట్టణం 8 ఇంక్లైన్ కాలనీలోని కేకే నగర్‌లో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కేకే నగర్‌లో నివాసముంటున్న అంజలి అనే యువతిని ప్రియుడే కూరగాయలు కోసే కత్తి పీటతో నరికి చంపాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది.
నిందితుడు కూడా అదే కాలనీలో నివాసముంటున్నట్టు తెలుస్తోంది. అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోనికి వెళ్లి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.కాగా, యువతి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






