గిల్ అరుదైన ఘనత

30

దిశ, స్పోర్ట్స్ : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన గిల్.. ఆసీస్ గడ్డపై 50 ప్లస్ స్కోర్ చేసిన అత్యంత పిన్న ఓపెనర్‌గా గుర్తింపుపొందాడు. ఆసియా బయట హాఫ్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఓపెనర్ల జాబితాలో శుభ్‌మన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అగ్రస్థానంలో ఉండగా.. మహదేవ్ అప్టే, పృథ్వీ షా, శుభ్‌మన్ తరువాతి స్థానంలో ఉన్నారు. 20 ఏళ్ల 44 రోజుల వయసులో రవిశాస్త్రి ఇంగ్లండ్‌పై 50కిపైగా పరుగులు చేయగా.. శుభ్‌మన్ 21 ఏళ్ల 122 రోజుల వయసుతో ఆసీస్‌పై హాఫ్ సెంచరీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.