ప్రజ‌లను చైత‌న్యప‌ర్చేందుకు ‘ దోమ మ‌స్కట్’

by Shyam |

<p>దిశ, న్యూస్​బ్యూరో: సీజ‌న్‌లో దోమ‌ల వ్యాప్తిని నియంత్రించుట‌లో ప్రజ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు జీహెచ్​ఎంసీ వివిధ కార్యక్రమాల‌ను చేపడుతోంది. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద లిబర్టీ రోడ్​లో ‘ దోమ‌ల మ‌స్కట్‌’ ను ఏర్పాటు చేసింది. దోమల నివారణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు మస్కట్​ను ఏర్పాటు చేసినట్టు జీహెచ్​ఎంసీ ఎంటమాలజీ విభాగం తెలిపింది. దోమ‌ల సంతాన వృద్ధిని అరిక‌ట్టుట‌కు అవ‌గాహ‌న కార్యక్రమాల‌తో పాటు యాంటి లార్వా స్ప్రేయింగ్ ప‌నుల‌ను జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జి విభాగం ముమ్మరం చేసింది. ప్రస్తుతం [&hellip;]</p>

ప్రజ‌లను చైత‌న్యప‌ర్చేందుకు ‘ దోమ మ‌స్కట్’
X

దిశ, న్యూస్​బ్యూరో: సీజ‌న్‌లో దోమ‌ల వ్యాప్తిని నియంత్రించుట‌లో ప్రజ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు జీహెచ్​ఎంసీ వివిధ కార్యక్రమాల‌ను చేపడుతోంది. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద లిబర్టీ రోడ్​లో ‘ దోమ‌ల మ‌స్కట్‌’ ను ఏర్పాటు చేసింది. దోమల నివారణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు మస్కట్​ను ఏర్పాటు చేసినట్టు జీహెచ్​ఎంసీ ఎంటమాలజీ విభాగం తెలిపింది.

దోమ‌ల సంతాన వృద్ధిని అరిక‌ట్టుట‌కు అవ‌గాహ‌న కార్యక్రమాల‌తో పాటు యాంటి లార్వా స్ప్రేయింగ్ ప‌నుల‌ను జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జి విభాగం ముమ్మరం చేసింది. ప్రస్తుతం యాంటీ లార్వా ఆప‌రేష‌న్లకు 3డ్రోన్లను వినియోగిస్తున్నారు.‌ మ‌రో 15రోజుల్లో యాంటి లార్వా ఆప‌రేష‌న్లకు వినియోగిస్తున్న డ్రోన్ల సంఖ్యను 11కు పెంచ‌నున్నట్టు అధికారులు తెలిపారు. పైలెట్ ప‌ద్దతిలో 74ఫాగింగ్ మిష‌న్లను జిపిఎస్‌కు లింక‌ప్ చేసి జిహెచ్‌ఎంసి అధికారులు వాటి ప‌నితీరును మానిట‌రింగ్ చేస్తున్నట్టు వివరించారు.

Next Story