- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల గైడ్‌లైన్స్ విడుదల
<p>దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు, ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలతో పాటు నామినేషన్లు, ప్రచారపర్వానికి సంబంధించిన అంశాలపై అందులో స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ యాక్టును అనుసరిస్తూ గతం మాదిరిగానే ఈసారి కూడా జనరల్ కేటగిరీలోని అభ్యర్థులకు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500 డిపాజిట్ సొమ్ముగా నిర్ధారించింది. […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు, ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలతో పాటు నామినేషన్లు, ప్రచారపర్వానికి సంబంధించిన అంశాలపై అందులో స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ యాక్టును అనుసరిస్తూ గతం మాదిరిగానే ఈసారి కూడా జనరల్ కేటగిరీలోని అభ్యర్థులకు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500 డిపాజిట్ సొమ్ముగా నిర్ధారించింది. నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. ప్రతిపాదిత, బలపర్చే అభ్యర్థులు స్థానికంగా ఉన్న వార్డులకు చెందినవారు కావాలని, వార్డుల జాబితాలో ఓటు హక్కు ఉన్నవారే ప్రతిపాదించాల్సి ఉంటుందని పేర్కొంది. గ్రేటర్లో ఓటు హక్కు ఉన్న వారు ఏ వార్డుల్లోనైనా పోటీ చేసేందుకు అర్హులని తెలిపింది. కాగా, ప్రచార పరిమితి వ్యయాన్ని, అభ్యర్థులు మూడు వాహనాలకు మించి వాడరాదన్న విషయాన్ని గతంలోనే ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ప్రతివార్డులో ఫేస్ రికగ్నైజ్ సెంటర్
జనవరిలో నిర్వహించిన కొంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నైజ్ పోలింగ్‌ను చేపట్టి 80 శాతం సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి వార్డులోని ఒక పోలింగ్ కేంద్రంలో ఫేస్ రికగ్నైజ్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కాగా, పాతబస్తీ పోలింగ్ కేంద్రాల్లో ఈ విధానాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా నేపథ్యంలో గ్రేటర్ అధికారులు ఫేస్ రికగ్నైజ్ సెంటర్ ఏర్పాటు చేసే జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సామగ్రి, ఇంటర్నెట్ ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నారు. సోమవారం నాటికి ఈ కేంద్రాలు ఖరారు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పాతబస్తీలో ఈ కేంద్రాల ఏర్పాటును వద్దని కోరుతూ ఇప్పటికే ఎంఐఎం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని వార్డుల్లో ఒక్క సెంటర్లో ఫేస్ రికగ్నైజ్ ఏర్పాటు చేస్తుండగా పాతబస్తీ పరిధిలోని కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని, అభ్యంతరం వ్యక్తం చేసే ఓటర్లకు మినహాయింపు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.






