హైదరాబాద్‌కు జర్మనీ రాయబారి!

76
HYD

దిశ, సిటీ బ్యూరో : జర్మనీ రాయబారి జోహన్నెస్ హోబర్ శుక్రవారం నుంచి రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా నగరానికి రానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బుధవారం చెన్నైకి చేరుకున్న రాయబారి శుక్రవారం హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలుకోనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

రాయబారికి నగరంలోని జియోత్ జంత్రం సంస్థకు చెందిన కరిన్ స్టన్, అమితా దేశాయిలు స్వాగతం పలకనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఆయన జీహెచ్ఎంసీ కార్యకలాపాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..