కొవిడ్ ముందుతో పోలిస్తే 17 శాతం పెరిగిన ఆభరణాల ఎగుమతులు

by  |
కొవిడ్ ముందుతో పోలిస్తే 17 శాతం పెరిగిన ఆభరణాల ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఆగష్టు నెలలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు కొవిడ్‌కి ముందు 2019, ఆగష్టులో కంటే 17 శాతం పెరిగాయి. మంగళవారం విడుదలైన రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి(జీఏఈపీసీ) గణాంకాల ప్రకారం సమీక్షించిన నెలలో రూ. 24,239.81 కోట్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల ఎగుమతులు కోలుకుంటున్నాయి. దేశంలో మార్కెట్లు క్రమంగా తెరుచుకోవడం, కరోనా ఆంక్షలు తొలగించడం, పండుగ సీజన్ కావడంతో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాయని’ జీజేఈపీసీ చైర్మన్ కోలిన్ షా అన్నారు. కట్, పాలిష్ చేసిన వర్జాల ఎగుమతులు 2019 ఆగష్టు కంటే ఈ ఏడాది 29.37 వృద్ధి నమోదైంది. బంగారు నగల ఎగుమతులు 2019తో పోలిస్తే ఈ ఏడాది ఆగష్టులో రూ. 5,757 కోట్లతో 15.06 శాతానికి తగ్గాయి.


Next Story

Most Viewed