- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలతో గ్యాస్ కంపెనీల చెలగాటం
<p>దిశ, మియాపూర్ : పేలుడు పదార్థాలకు సంబంధించిన పనులను ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు గ్యాస్ కంపెనీల పంపిణీదారులు మాత్రం భద్రత నియమాలను పూర్తిగా ఉల్లంఘించారు. ఇష్టారాజ్యంగా జనవాసాల్లో గోడౌన్లను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇందుకు మియాపూర్, హఫీజ్‌పేట్, చందా నగర్‌లో ఏర్పాటైన గోడౌన్లే అందుకు నిదర్శనం. అయితే గ్యాస్ కంపెనీల పంపిణీదారులు గోడౌన్లను ఏర్పాటు చేసే ముందు రూల్స్ పాటించాల్సి […]</p>

దిశ, మియాపూర్ : పేలుడు పదార్థాలకు సంబంధించిన పనులను ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు గ్యాస్ కంపెనీల పంపిణీదారులు మాత్రం భద్రత నియమాలను పూర్తిగా ఉల్లంఘించారు. ఇష్టారాజ్యంగా జనవాసాల్లో గోడౌన్లను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇందుకు మియాపూర్, హఫీజ్‌పేట్, చందా నగర్‌లో ఏర్పాటైన గోడౌన్లే అందుకు నిదర్శనం.
అయితే గ్యాస్ కంపెనీల పంపిణీదారులు గోడౌన్లను ఏర్పాటు చేసే ముందు రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం పంపిణీదారులు తమ పలుకుబడిని ఉపయోగించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఓసీతోపాటు క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహారిస్తున్నారన్న అపవాదు స్థానికుల్లో నెలకొంది.
రెండేళ్ల కిందటే జనవాసాల్లో ఉన్న గోడౌన్లను తరలించాలని లేదంటే లైసెన్స్‌లు రద్దు చేస్తామని నగరపాలక సంస్థ హెచ్చరించింది. కానీ, నాటి నుంచి నేటి వరకు మళ్లీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ పరిస్థితి ఏంటని గోడౌన్ల చుట్టు పక్కల నివాసం ఉండే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని జనావాసాల మధ్య నుంచి గోడౌన్లను తొలగించి పొంచివున్న ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.







