బ్రేకింగ్.. కరీంనగర్‌లో గ్రానైట్ ‘క్వారీ’ వార్.. మంత్రి గంగుల ఫ్యామిలీ మెంబర్ ఆడియో కలకలం

by  |
బ్రేకింగ్.. కరీంనగర్‌లో గ్రానైట్ ‘క్వారీ’ వార్.. మంత్రి గంగుల ఫ్యామిలీ మెంబర్ ఆడియో కలకలం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : గ్రానైట్ పరిశ్రమలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరీంనగర్‌లో ఇప్పుడు కొత్త పంచాయితీ మొదలైంది. క్వారీ అసోసియేషన్, ఫ్యాక్టరీ అసోసియేషన్ మధ్య వార్ మొదలైనట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సీక్రెట్‌గా సాగుతున్న ఈ వ్యవహారం చివరకు ఆడియో రికార్డులతో తమ వైఖరిని స్పష్టం చేసుకునే స్థాయికి చేరింది. గ్రానైట్ క్వారీ యజమానుల సంఘానికి, కటింగ్, పాలిషింగ్ యూనిట్లు, ఫ్యాక్టరీ అసోసియేషన్‌కు మధ్య మాటల యుద్దం సాగుతోంది. అయితే ఈ రెండు సంఘాల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల కారణంగానే ఈ వార్ స్టార్ట్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది.

కానీ, అంతర్గతంగా మాత్రం ఆధిపత్య పోరుతో పాటు అసోసియేషన్ ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుతోనే ఇంతదూరం వచ్చినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. క్వారీ అసోసియేషన్‌కు ఒక్కో ఫ్యాక్టరీ యజమాని రూ. 25 వేలు ఇవ్వాలని అడుగుతున్నారని ఈ విషయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఫ్యాక్టరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, మంత్రి గంగుల కమలాకర్ అన్న కొడుకు గంగుల ప్రదీప్ స్పష్టం చేస్తున్నారు. తనపై క్వారీ అసోసియేషన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అంతేకాకుండా తాను వేరే ప్రాంతంలో ఉన్నందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

మరో ఆడియోలో గంగుల ప్రదీప్ మాట్లాడుతూ.. మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపులో బెంగుళూరులో ఉన్నందున రాగానే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఫ్యాక్టరీ అసోసియేషన్ సభ్యులు ఎవరూ కూడా డబ్బులు చెల్లించవద్దని కోరారు. అలాగే లారీ అసోసియేషన్ వాళ్లను కూడా ఒక్కో ట్రిప్పుకు రూ. 500 చొప్పున ఇవ్వాలని అడుగుతున్నారని ప్రదీప్ ఆరోపించారు. వారు కూడా మద్దతు తెలిపారని, ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, అవసరమైతే టెంట్ వేసుకుని కూర్చుందాం అంటూ ఆయన స్పష్టం చేశారు.

లోకల్ వాళ్లందరం యూనిటీగా కొట్లాడుదాం, ఎవ్వడు చచ్చినా సరే, ఎవ్వడు చంపినా సరే దీని కోసం కొట్లాడటమే, వెనక్కి తగ్గేది లేదు.. ఈ ఇష్యూలో అంటూ స్పష్టం చేశారు. ఈరోజు రూ. 25 వేలు అడిగాన వాళ్లు రేపు ఇళ్లు రాసివ్వమంటారు ఇచ్చేస్తారా..? మీరు లోకల్ వాళ్లు ఎక్కడి నుండి ఎవడో వచ్చి మిమ్మల్ని డబ్బులు అడుగుతం అనడం కరెక్టేనా..? ఇండస్ట్రీ మార్వాడి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది అంటూ ప్రదీప్ హెచ్చరించారు.


Next Story