- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేకాను చంపాల్సిన అవసరం లేదు.. గంగిరెడ్డి క్లారిటీ
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా గంగిరెడ్డితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు వాచ్‌మెన్ రంగయ్య చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఆరోపణలపై వైఎస్ వివేకా ప్రధాన అనుచరుడు గంగిరెడ్డి స్పందించారు. తాను ఎవరినీ బెదిరించలేదని, తనను బాగా చూసుకున్న వివేకాను ఎందుకు చంపుతానని ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో తన ప్రమేయం అసలు లేదన్నారు. వాచ్‌మెన్ రంగయ్యతో తనకు అసలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా గంగిరెడ్డితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు వాచ్‌మెన్ రంగయ్య చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఆరోపణలపై వైఎస్ వివేకా ప్రధాన అనుచరుడు గంగిరెడ్డి స్పందించారు. తాను ఎవరినీ బెదిరించలేదని, తనను బాగా చూసుకున్న వివేకాను ఎందుకు చంపుతానని ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో తన ప్రమేయం అసలు లేదన్నారు.
వాచ్‌మెన్ రంగయ్యతో తనకు అసలు పరిచయమే లేదని, ఆయనను బెదిరించాల్సిన అవసరమే లేదని గంగిరెడ్డి చెప్పారు. కాగా వివేకాను ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి కలిసి హత్య చేశారని రంగయ్య ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లూ గంగిరెడ్డికి భయపడి ఏం చెప్పలేదన్నారు. చంపేస్తానని గంగిరెడ్డి తనను బెదిరిస్తున్నారని చెప్పారు. దీంతో రంగయ్యకు పోలీసులకు భద్రత ఏర్పాటు చేశారు.
Next Story






