- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయి పల్లవి కంటే మస్త్ డ్యాన్స్ చేస్తా.. గంగవ్వ వీడియో!
<p>దిశ, సినిమా : తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ఆడియన్స్‌ను రీచ్ అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘లవ్ స్టోరి’ని ప్రమోట్ చేసేందుకు.. ఈ సినిమాలో నటించిన యూట్యూబ్ స్టార్ గంగవ్వను ఎంచుకుంది. ఇక కరోనా కారణంగా సినిమాను థియేటర్‌లో చూడలేకపోయిన గంగవ్వ ప్రస్తుతం ‘ఆహా’లో చూసి ఎంజాయ్ చేసింది. అంతేకాదు అందరూ చూసి ఆస్వాదించాలని కోరింది. కాగా ఇందుకు సంబంధించిన ఓ చిన్న క్లిపింగ్ షేర్ చేసిన […]</p>

X
దిశ, సినిమా : తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ఆడియన్స్‌ను రీచ్ అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘లవ్ స్టోరి’ని ప్రమోట్ చేసేందుకు.. ఈ సినిమాలో నటించిన యూట్యూబ్ స్టార్ గంగవ్వను ఎంచుకుంది. ఇక కరోనా కారణంగా సినిమాను థియేటర్‌లో చూడలేకపోయిన గంగవ్వ ప్రస్తుతం ‘ఆహా’లో చూసి ఎంజాయ్ చేసింది. అంతేకాదు అందరూ చూసి ఆస్వాదించాలని కోరింది. కాగా ఇందుకు సంబంధించిన ఓ చిన్న క్లిపింగ్ షేర్ చేసిన ఆహా.. ఈ విధంగా సినిమాను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా గంగవ్వ.. ఇప్పుడు మోకాళ్ల నొప్పులతో డ్యాన్స్ చేయలేకపోతున్నా కానీ అప్పట్లో సాయి పల్లవి కంటే మంచిగ డ్యాన్స్ చేసేదాన్నని తెలిపింది. ఇక చైతును తన మనవడిగా భావిస్తానన్న అవ్వ.. ఎంత తెల్లగా, అందంగా ఉన్నాడో అంత కన్నా బాగా యాక్ట్ చేస్తాడని మెచ్చుకుంది.
Next Story






