- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాన్గార్ బస్తీలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్
<p>దిశ, హైదరాబాద్: నగరంలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాన్గార్ బస్తీలో రెండు వర్గాలు కత్తులు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో సుమారు 30 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులను మట్టుబెట్టాలని శుక్రవారం రాత్రి సుమారు 80 మంది కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఫ్జల్ […]</p>

దిశ, హైదరాబాద్: నగరంలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాన్గార్ బస్తీలో రెండు వర్గాలు కత్తులు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో సుమారు 30 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులను మట్టుబెట్టాలని శుక్రవారం రాత్రి సుమారు 80 మంది కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఫ్జల్ సాగర్ పరిధిలోని మాంగార్ బస్తీలో నివాసముండే కపిల్, అతని భార్య దీప శుక్రవారం రాత్రి గణేష్ కట్టలోని బంధువుల ఇంట్లో వివాహ వేడుకలకు హాజరయ్యారు.
గణేష్ కట్ట ప్రాంతానికి చెందిన రాజు కుటుంబంతో కపిల్‌కు పాత గొడవలు ఉన్నాయి. కపిల్ తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రాజు తారసపడడంతో వారిద్దరూ గొడవ పడ్డారు. దీంతో కపిల్, రాజు బంధువులు రావడంతో గొడవ ముదిరింది. సుమారు రెండు గంటల పాటు గణేష్ కట్ట ప్రాంతం రణరంగంగా మారింది. పరస్పర దాడుల్లో ఇరువర్గాలకు చెందిన 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇరువర్గాల పై కేసు నమోదు చేశారు.






