- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. గద్వాల ఎమ్మెల్యేకు పితృవియోగం
<p>దిశ, జోగులంబ గద్వాల : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామి రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు గత నెల రోజులుగా ఆరోగ్యం బాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం గుండెపోటు రాగా తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే ఇంటివద్ద పార్థీవ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. శుక్రవారం వారి సొంత గ్రామం థరూర్ మండలం బూరెడ్డిపల్లిలో అంతక్రియలు నిర్వహించ నున్నట్టు కుటుంబసభ్యులు […]</p>

దిశ, జోగులంబ గద్వాల : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామి రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు గత నెల రోజులుగా ఆరోగ్యం బాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం గుండెపోటు రాగా తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే ఇంటివద్ద పార్థీవ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. శుక్రవారం వారి సొంత గ్రామం థరూర్ మండలం బూరెడ్డిపల్లిలో అంతక్రియలు నిర్వహించ నున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మృతదేహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో పాటు జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ సరితా, అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ తదితరులు నివాళులు అర్పించి ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వివిధ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు.






