రిలయన్స్-ఫ్యూచర్ రిటైల్ కొనుగోలుపై అమెజాన్ అప్పీల్ స్వీకరణ!

by  |
రిలయన్స్-ఫ్యూచర్ రిటైల్ కొనుగోలుపై అమెజాన్ అప్పీల్ స్వీకరణ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశీయ రిటైల్ రంగంలో అమెజాన్, ఫ్యూచర్ రిటైల్ మధ్య వివాదం కీలకంగా మారింది. ఈ క్రమంలో ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ దాఖలు చేసిన అప్పీల్‌ను స్వీకరించింది. ఇదివరకు సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అమెజాన్ కంపెనీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. విచారణ చేపట్టిన కోర్టు ఫ్యూచర్ రిటైల్‌తో పాటు రిలయన్స్ రిటైల్ కంపెనీలకు నోటీసులను ఇచ్చింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

కాగా, దేశీయంగా అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్యుచర్ రిటైల్ వెంచర్లను కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 24,713 కోట్లు. అయితే, ఈ కొనుగోలు ప్రక్రియ చెల్లదని చెబుతూ అమెజాన్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. బిగ్‌బజార్‌ను నిర్వహిస్తున్న ఫ్యూచర్ రిటైల్ వెంచర్‌లో అమెజాన్‌కు 5 శాతం వరకు పరోక్షంగా పెట్టుబడులు ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ సమయంలో ఇరు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందాలకు విరుద్ధంగా రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ఉందనే అభిప్రాయాన్ని అమెజాన్ వ్యక్తం చేసింది.

అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం..వీటి ఒప్పందం సమయం ముగిసే వరకు ఫ్యూచర్ రిటైల్ వెంచర్ స్వతంత్రంగా ఉండాల్సి ఉంది. అయితే, దీన్ని ఉల్లంఘిస్తూ కిశోర్ బియానీ రిలయన్స్‌తో విలీనానికి సిద్ధపడ్డాని అమెజాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ కోర్టుకు వెళ్లంగా సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పు ఫ్యూచర్ రిటైల్ గ్రూపునకు అనుకూలంగా ఉంది. దీన్ని సవాల్ చేస్తూ అమెజాన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.



Next Story

Most Viewed