- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. మిగిలిన ఇతర జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షాపాతం 8.33 మిమీ ఉండగా 6.9 మిమీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. మిగిలిన ఇతర జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షాపాతం 8.33 మిమీ ఉండగా 6.9 మిమీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లా మూసాయిపేటలో 109.0 మిమీ వర్షపాతం నమోదవ్వగా.. హైదరాబాద్‌లో అత్యధికంగా ఆసిఫ్ నగర్‌లో 3.2మిమీ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో 15.6మిమీ నుంచి 64.4మిమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
- Tags
- 3days
- full rains
Next Story






