ప్రమాదంలో మరణించిన స్నేహితుడి కుటుంబానికి చేయూతనిచ్చిన స్నేహితులు

by  |
ప్రమాదంలో మరణించిన స్నేహితుడి కుటుంబానికి చేయూతనిచ్చిన స్నేహితులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆత్మకూరు (ఎస్) మండలం ఏనుబాముల గ్రామానికి చెందిన చందా విజయ్ కుమార్ ఇటీవల హన్మకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ దుర్వార్త తెలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెమ్మికల్ లో చదివిన తన చిన్న నాటి స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమతో పాటు కలిసి మెలిసి చదువుకొనీ, ఆడిపాడి పెరిగిన మిత్రుడు దూరమవ్వడం జీర్ణించుకోలేక పోయారు. తమ మిత్రుడి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి అందరూ కలిసి 30 వేల రూపాయలు జమ చేశారు.

పెద్దకర్మ దిన సందర్భంగా మిత్రుడు భార్య, ఇద్దరు పిల్లలను పరామర్శించి ఆర్థిక సహాయంతో పాటు చిరు జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఛైర్మన్ బయ్యా శివరాజ్, అబ్బోజు సతీష్ కుమార్, జానకి రాములు, ఉపేందర్, సుధాకర్ ,వర్రె శంకర్, అజ్మీరా శ్రీను, లావుడ్యా నాగయ్య, కర్ణాకర్ రెడ్డి, పాపిరెడ్డి , పద్మయ్య, శ్రవణ్, యల్ల రాములు, వీరశేఖర్ , భవాని, మహాలక్ష్మి, నర్సమ్మ, ఆంథోని తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed