ఈ రాశి వారికి బిజినెస్‌లో బోలెడు లాభాలు

132
Panchangam

తేది : 17, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ఏకాదశి
(నిన్న ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 9 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 10 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 37 ని॥ వరకు)
యోగము : అతిగండము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 8 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 0 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 18 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 22 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 9 ని॥ వరకు)

మేష రాశి: ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఇతరుల నుంచి బహుమానాలు అందు కుంటారు. దూర ప్రయాణాలను కుదిరితే వాయిదా వేసుకోండి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. ఆదాయం పరవాలేదు. అవసరమైన విషయాలకు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాల మీద మీ భార్య భర్తల మధ్య గొడవలు రావచ్చు జాగ్రత్తపడండి.

వృషభ రాశి: స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. స్థిరాస్తి వ్యవహారాలు లాభాలను తెస్తాయి. ఒక శుభవార్త వలన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు అనవసరపు విషయాలను వదిలేయండి చదువు మీద శ్రద్ధ పెట్టండి. మీ సామర్థ్యం మీద మీరు ఒక అవగాహనకు రండి. ఆఫీసు పనులను సకాలంలో త్వరత్వరగా పూర్తి చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభాలను తెస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు సంయమనంగా మాట్లాడుకోండి అపార్థాలు తొలగి ఒకటవుతారు.

మిధున రాశి: వ్యాపారస్థులకు నష్టాల బాధలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసము ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వహించ వద్దు. కోపతాపాలను వదిలివేయండి. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. పెళ్లికాని వారికి సంబంధం కుదిరే అవకాశం. నిరుద్యోగులకు శుభవార్త కొంతమంది ఉద్యోగులకు ఆఫీస్ టూర్. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి: ఇతరులతో వాదోపవాదాలు దిగకండి. ఒత్తిడిని వదిలివేయండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. దేవాలయాల సందర్శన వరణ మనశ్శాంతి విదేశీ వ్యాపారం చేసే వారు జాగ్రత్తగా పడండి. నిరుద్యోగులు అనవసర విషయాలను వదిలి అధిక శ్రమ పడవలసి ఉంది. సమయం చాలా విలువైనదని గుర్తించండి ఆఫీసులో అదనపు బాధ్యతల వల్ల అధిక శ్రమ. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అనవసరపు ఖర్చులను నివారించండి. అధిక శ్రమ వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క అనారోగ్యం వలన మానసిక అశాంతి.

సింహరాశి: మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అన్నివిధాలా అనుకూలమైన రోజు. పాల వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు. ఆఫీసులో పనులను పెండింగ్ పనుల తో సహా పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. ఆత్మీయుల నుంచి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ పెద్దల నుండి బహుమతి అందుకుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజును గడపండి.

కన్యారాశి: ఆశావాహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు కొంతమంది ఉద్యోగులకు జీతం పెరుగుదల కొంతమందికి ప్రమోషన్. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆఫీసుకు పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలోని సమస్యల వలన మానసిక చికాకు. కావలసిన ధనం చేతికందుతుంది అవసరాలకు ఖర్చు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

తులారాశి: సహనం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగం మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కొంతమందికి ట్రాన్సఫర్ కొంతమందికి ప్రమోషన్. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. భార్యతో పరుషంగా మాట్లాడకండి ఆమె బాధ పడతారు. ఆదాయం బాగున్నా అనవసరపు దుబారా ఖర్చుల వలన డబ్బుకు ఇబ్బంది. అధిక శ్రమ వల్ల తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి: స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. మిశ్రమ అనుభవాల రోజు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో పై అధికారులతో వాదోప వాదాలకు దిగకండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ పిల్లలతో ఆనందంగా గడపండి అది మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. పాజిటివ్ ఆలోచనల వలన రోజంతా ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు మొండితనం వదిలిపెట్టండి ఒకరినొకరు గౌరవించుకోండి ఆనందంగా గడపండి.

ధనుస్సు రాశి: ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. మీ తల్లి గారి వైపునుంచి ధన సహాయం లభిస్తుంది. మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ విభాగాలలో పనిచేస్తున్న వారు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే అధిక శ్రమ అవసరం. మీకు ఏ విధంగానూ తగరు అనుకున్న స్నేహాలను వదిలిపెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి: చదువుపై విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు కొద్ది రోజులలో శుభవార్త. వ్యాపారస్తులకు మిశ్రమ అనుభవాలు. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. పాతబాకీలు వసూలవుతాయి. పాత స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ కొరకు మీరు కొంత సమయం కేటాయించుకోండి ఫిట్ నెస్ ను మెరుగుపరచుకోండి. కొత్తవి మనసుకు నచ్చిన పనులు చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తు చేస్తోంది.

కుంభరాశి: మీ శక్తి సామర్థ్యాలను మరింత మెరుగుపరచుకునే ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసము తెలివితేటలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను మీరే తీసుకోండి. ఆఫీసులో పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ అవసరాలకు మించిన డబ్బు లభిస్తుంది. స్టాక్ మార్కెట్ లలో లాభాలు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి: ధైర్యము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు అందరిని ఆదుకోవాలనే మీ ఆలోచన మంచిదే కానీ మీ శక్తి సామర్థ్యాలను గుర్తించండి. ఇంతకు ముందు ఇచ్చిన అప్పును తీర్చకుండా మరల అప్పు అడిగే స్నేహితులను వదిలివేయండి. ఆఫీసు పనులలో మీ శక్తి సామర్థ్యాలపై అందరూ ప్రశంసలు కురిపిస్తారు ఇది మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులు ఒక శుభవార్త అందుకుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క స్నేహ ప్రవర్తన మీకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..